పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : వెంకటాపూర్ మండల పరిధిలో ఉన్న వ్యవసాయ క్షేత్రాలను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వరంగల్ శాస్త్రవేత్తలు డాక్టర్ వి వెంకన్న, డాక్టర్ ఆర్ విశ్వతేజ, డాక్టర్ డి వీరన్న, బి మాధవి, మండల వ్యవసాయ అధికారి శైలజ, విస్తరణ అధికారులు పవన్, శ్రీనివాస్ లతో గురువారం సందర్శించారు. అనంతరం మండ ల పరిధిలోని వరి పొలాలు, పత్తి ,మిర్చిపంటలను పరిశీలిం చారు. ఈ సందర్భంగా వారు రైతులకు పలు సూచనలు చేశా రు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరిలో బ్యాక్టీరియల్ ఆకు పచ్చ తెగులు ఆశించినట్లు గుర్తించడం జరిగింది. నివారణకు యూరియా వేయడం తాత్కాలికంగా నిలిపి వేయాలి, ప్లాంటోమైసిన్ 0.4 గ్రాతొ పాటు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3గ్రా. లీటరు నీటికి కలిపి పిచికార చేసుకోవాలి. పత్తిలో తామర పురుగు, పచ్చ దోమ అధికంగా ఆశించినట్లు గుర్తిం చారు, వీటి నివారణకు డైఫెన్ తయోయురాన్ 1.25గ్రా. లేదా ఫ్లోనికామిడ్ 0.3 ఎం ఎల్ లీటర్ నీటిలో కలిపి పిచకారి చేసు కోవాలి. ప్రస్తుతం మిర్చి పంటలో తామర పురుగు నల్లి ఉన్న ట్లు గమనించారు. వీటి నివారణకు ఫిప్రోనీల్ 2 ఎం ఎల్ లేదా డైమెథొయేట్ 2 ఎమ్ ల్ లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసు కోవాలని సూచించారు.ఈక్షేత్ర ప్రదర్శనలో 2 గ్రామాల రైతులు పాల్గొన్నారు.