ఎయిడ్స్ పై ఇంటింటి ప్రచారం
మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలనకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియం త్రణ సంస్థ ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలోని సమీకృత సలహా పరీక్ష కేంద్రం ఆధ్వర్యంలో ఐసిటిసి కౌన్సిలర్ గాదె రమేష్ అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. గురువారం కాళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఎడపల్లిలో ఆరోగ్య సిబ్బందితో కలిసి హెచ్ఐవి, ఎయిడ్స్ నివారణ కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించి, కరపత్రాలు పంపిణీ చేశారు. హెచ్ఐవి, ఎయిడ్స్ సోకకుండా ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐసిటిసి కౌన్సిలర్ గాదె రమేష్ సూచించారు. అలాగే ఇంటింటి తిరిగి జ్వర సర్వే నిర్వహించారు. రక్త నమూనాలను సేకరించి, పరీక్షలు నిర్వహించారు. డ్రై డే ను కొనసాగించారు. ఎడపెల్లిలో నిర్వహించిన ఆరోగ్య శిబిరంలో గర్భిణీలకు, బాలింతలకు, ప్రజలకు మందు గుళికలను అంద జేశారు. ఈ కార్యక్రమాలలో ఐ సి టి సి కౌన్సిలర్ గాదె రమేష్, హెల్త్ అసిస్టెంట్ అడప రాజా రమణయ్య, ఏఎన్ఎమ్ లు హేమలత, వెంకటమ్మ, ఆశ కార్యకర్తలు రుద్ర, మల్లీశ్వరి, హేమ లత లు పాల్గొన్నారు.