ఎస్సి సెల్ వెంకటాపురం మండల అధ్యక్షుడిగా రావుల నాని
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా భద్రాచలం నియోజకవర్గం నూగూరు వెంకటాపురం మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులుగా యువ నాయకుడు రావుల నాని ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం భద్రాచలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ డి.సిసి అధ్యక్షులు, తెలం గాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోదేం వీరయ్య, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ చింతిరియాల రవికుమార్ చేతుల మీదుగా నాని నియామక పత్రాన్ని అందుకున్నారు.ఈ సంద ర్భంగా కాంగ్రెస్ పార్టీ టి.పి.సి.సి మేంబర్ నల్లపు దుర్గాప్రసాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, మన్యం సునీల్, కిరణ్ వర్మ, వెంకటాపురం పి ఎస్ సి ఎస్ చైర్మన్ చీడెం మోహన్రావు, కాంగ్రెస్ ములుగు జిల్లా బ్లాక్ అధ్యక్షుడు సాంబ శివరావు, కాంగ్రెస్ పార్టీ సభ్యుడు బాలసాని వేణు , కిసాన్ అధ్యక్షుడు జల్లిగంపల కళాధర్,చిట్టి మల్ల దేవా, యాసం రమేష్, చెన్నం నరేష్, తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు రావుల నాని ని అభినందించారు.