ఎదురెదురుగా ఇసుక లారీలు ఢీ – డ్రైవర్లకు తీవ్ర గాయాలు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం 163 జాతీయ రహదారి గుమ్మడి దొడ్డి వంతెన సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఎదురెదు రుగా రెండు ఇసుక లారీలు వేగంగా ఢీకొన్నాయి. ఈ ఘటన లో ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. లారీల ముందు భాగాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. తెలిసిన వివరాల ప్రకారం … ఇసుక లోడింగ్ తో వస్తున్న లారీ, ఇసుక లోడింగ్ కోసం వెళ్తున్న మరో ఖాళీ లారీ ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నా యి. దీంతో ఒక లారీ డ్రైవర్ కు కాళ్లు చేతులు విరిగిపోగా, మరో డ్రైవర్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సంఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను అంబు లెన్స్ ద్వారా ప్రభుత్వ వైద్యశాలకు చికిత్సకై తరలించారు.