స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంను సందర్శించిన పెసా కోఆర్డినేటర్
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : మండల కేంద్రంలో శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయ ఫంక్షన్ హాల్లో ఎస్బిఐ ఆర్సీటీ సహకారంతో మహిళలకు నిర్వహిస్తున్న స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంను పెసా కో ఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ సంద ర్శించారు. ఈ సందర్భంగా మహిళలకు నేర్పుతున్న మగ్గం, ఎంబ్రాయిడరి, మొదలగు వాటిపై ఉచిత శిక్షణతో పాటు భోజన వసతి కల్పిస్తున్న యాజమాన్యంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సంస్థలు మరొక సదవకాశాన్ని ఏజెన్సీ లోని అన్ని వర్గాల యువతులకు, మహిళలకు ఈ నెల 18 వ తేది నుండి 30 తేది వరకు జనపనార సంచులు (జూట్ బ్యాగ్స్) తయారీ శిక్షణను 35 మందికి 13 రోజుల పాటు నిర్వహించ నున్నట్లు నిర్వాహకులు తెలియజేసారు. ఆసక్తి గల ఆదివాసీ యువతులు, మహిళలు ఈ నెల 2 వ తేది నుండి దరఖాస్తు చేసుకోవాలని, పారంతో ఆధార్, తెల్లరేషన్ కార్డు, జీరాక్స్ ప్రతులు 4 ఫొటోస్ వెంట తీసుకొని రావాలని తెలిపారు. దీంతో పాటు అగర బత్తిల తయారీ పై శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో చైర్మన్ పెండ్యాల ప్రభాకర్, ఉపాధ్యక్షుడు కుమార స్వామి, ప్రధాన కార్యదర్శి సతీశ్, సహాయ కార్యదర్శి రమేష్,కోశాధికారి వెంకట్రావు, దడిగల సమ్మయ్య, రెబ్బల లక్ష్మణ్, లలిత, సమ్మక్క, సుశీల తో పాటు ఆనంతుల రజిని, సృజన, మగ్గం, ఎంబ్రాయిడరీ నేర్చుకుం టున్న మహిళలలతో పాటు తదితరులు పాల్గొన్నారు.