బెల్ట్ షాపులను నియంత్రించాలి

Written by telangana jyothi

Published on:

బెల్ట్ షాపులను నియంత్రించాలి

– ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: కాటారం సబ్ డివిజ న్ పరిధిలో విచ్చలవిడిగా వెలిసిన బెల్ట్ షాపులను నియంత్రిం చాలని సోమ వారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో నిర్వహిం చిన ప్రజావాణిలో కాటారం గ్రామానికి చెందిన యువకుడు రామిల్ల రాజబాపు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. వైన్ షాప్ యజమానులు బెల్ట్ షాపులకు అధిక రేట్లతో మద్యంను సరఫరా చేస్తూ, వినియోగ దారులకు కావలసిన బీరు, లిక్కర్ బ్రాండ్లను అందుబాటులో ఉంచడం లేదని ఫిర్యాదు చేశారు. మద్యం షాపులలో మందు ప్రియులు అధికంగా తాగే కింగ్ ఫిషర్ కంపెనీకి సంబంధించిన బీర్లు బ్రాందీ షాప్ లలో అమ్మడం లేదని, కేవలం బెల్ట్ షాపులకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బెల్ట్ షాపులలో 160 ధర ఉండే కే ఎఫ్ లైట్ బీరును, 210 రూపాయలకు అమ్ముతున్నారని తెలిపారు.

Leave a comment