వెంకటాపురంలో ప్రశాంతంగా బంద్

వెంకటాపురంలో ప్రశాంతంగా బంద్

వెంకటాపురంలో ప్రశాంతంగా బంద్

– పోలీసుల తనిఖీలు ముమ్మరం

    వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలో చల్పాక ఎన్కౌంటర్ కు నిరసనగా మావోయిస్టుల పిలుపు మేరకు బంద్ సంపూర్ణంగా జరుగుతున్నది. వర్తక వాణిజ్య సంస్థలు,ఆయిల్ బంకులు మూసి వేశారు. బ్యాంకులు యధా విధిగా పనిచేస్తున్నాయి. ఆదివారం రాత్రి తిరిగే ఆర్టీసీ బస్ సర్వీసులను వెంకటాపురం, వాజేడు, పేరూరు పోలీస్ స్టేషన్ దగ్గర భద్రతకై నిలిపి వుంచారు. ఈ మేరకు ప్రధాన రహదారి పై వచ్చే పోయే వాహనాలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మూసివేసిన దుకా ణాలను తెరవాలంటూ పోలీసుల సూచనలను సైతం వ్యాపా రస్తులు అమలు చేయటం లేదు. భద్రాచలం, వరంగల్ డిపో బస్సు సర్వీసులు సోమవారం యధావిధిగా నడుస్తున్నాయి. మావోయిస్టుల టార్గెట్ లో ఉన్న వారు రెండు మూడు రోజులు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళినట్లు సమాచారం.