ములుగులో టెన్త్ 589 మార్కులతో టాప్
ఏటూరునాగారం విద్యార్థి కృష్ణ అద్భుత ప్రతిభ
ములుగు, ఏప్రిల్ 29, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లాలో విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ఏటూరునాగారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి కృష్ణ 600 మార్కులకు గాను 589 మార్కులు సాధించి జిల్లా ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. అన్ని విషయాల్లో A1 గ్రేడ్లు సాధించి తన ప్రతిభను చాటింది. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన విద్యార్థి ఈ స్థాయి ఫలితాన్ని సాధించడం జిల్లా విద్యా రంగానికి గర్వకారణంగా నిలిచింది. ఈ విజయంతో విద్యార్థి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. కృషి, క్రమశిక్షణతో చదువుకుంటే ఎవరైనా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత విద్యను అభ్యసించి గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు, జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి తదితరులు విద్యార్థిని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.









