వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఎమ్మెల్యే పర్యటన
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండ లాల్లో శుక్రవారం భద్రాచలం శాసన సభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు, ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు ఏ. నర్సిరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ శుక్రవారం పర్యటించనున్నట్లు అధికారులు ప్రకటించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ముందు జాగ్రత్తగా పోలీసులు వెంకటాపురం, వాజేడు మండలాల్లో విస్తృతమైన భద్రతా పరమైన ఏర్పాట్లను నిర్వహిస్తున్నారు. వెంకటాపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సినాప్సిన్ అనే స్వచ్ఛంద సేవాసంస్థ ఉన్నత పాఠశాలను దత్తత తీసుకొని విద్యార్థుల విద్యాభివృద్ధికి కేటాయించిన సౌకర్యాలను భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అలుగునెల్లి నర్సిరెడ్డి, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాటు చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు విస్తృతమైన ఏర్పాట్లను నిర్వహించారు. పాఠశాల ఆవరణలో స్టేజీ సైతం ఏర్పాటు చేస్తున్నారు. వెంకటాపురం హైస్కూల్లో ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే వెంకటాపురంలో ప్రజాపాలన గ్రామసభలో పాల్గొననున్నారు. అనంతరం వాజేడు మండలంలో వివిధ కార్యక్రమంలో పాల్గొన నున్నట్లు అధికారులు మీడియాకు తెలిపారు.