మావోయిస్టులకు ఉనికే లేదు – కాటారం సిఐ నాగార్జున రావు
కాటారం ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : మావోయిస్టులకు ఈ ప్రాంతంలో ఉనికే లేదని కాటారం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈవూరి నాగార్జున రావు అన్నారు. సోమవారం ఆయన ఛాంబర్ లో విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఈనెల 28 నుంచి ఆగస్టు మూడో తారీకు వరకు మావోయిస్టుల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు ఈ ప్రాంతంలో ఆనవాళ్లే లేవని, మావోయిస్టుల ఉనికే లేదని ఆయన విస్పష్టంగా ప్రకటిం చారు. మావోయిస్టు కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పోలీసు యంత్రాంగం చెక్ పెడుతున్న నేపథ్యంలో.. మావోయిస్టులకు ఉనికి లేకుండా పోయిందని అన్నారు. మావోయిస్టు అగ్ర నేతలు సైతం ఈ ప్రాంతం నుంచి ఆ పార్టీలో ఎవ్వరు కూడా ప్రస్తుతం పనిచేయడం లేదని సీఐ నాగార్జున రావు అన్నారు. అయినప్పటికీ మావోయిజం సాహిత్యం పట్ల ఆకర్షితులుగా తయారు చేసేందుకు మావోయిస్టులకు అవకాశం లేకుండా యువతకు ఇతోదికంగా పోలీసు యంత్రాంగం సహాయ సహ కారాలు అందిస్తున్నదని వివరించారు. జయశంకర్ భూపాల పల్లి జిల్లా, కాటారం పోలీస్ సర్కిల్ పరిధిలోని కాటారం, అడవి ముత్తారం, కొయ్యూరు పోలీస్ స్టేషన్ ల పరిధిలో పోలీసు యంత్రాంగాన్ని అలర్ట్ చేశామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కాటారం మండల కేంద్రంలో మహాదే వపూర్ రహదారిపై కాటారం ఎస్సై మ్యాక అభినవ్ తో కలిసి సిఐ నాగార్జున రావు వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమా నితులు ఎవరైనా సంచరించినట్లయితే 100 నెంబర్ కు ప్రజలు డయల్ చేసి వివరాలు అందజేయాలని కోరారు. అలాగే నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, మైనర్లకు వాహనాలు ఇచ్చి నడపడం చట్టరీత్యా నేరమనే విషయం పట్ల అవగా హన కల్పించారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్డెన్ సెర్చ్ కార్యక్రమాలను సైతం నిర్వహించనున్నట్లు వివరించారు.