కాటారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉద్యోగికి విశ్వ విఖ్యాత గౌతమి బంగారు నంది పురస్కారం

Written by telangana jyothi

Published on:

కాటారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉద్యోగికి విశ్వ విఖ్యాత గౌతమి బంగారు నంది పురస్కారం

కాటారం ప్రతినిధి, తెలంగాణ జ్యోతి: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉద్యోగి, కవి, రచయిత, గాయకులు, సాహితీ వేత్త పుల్లూరి నాగేశ్వర్ కు విశ్వ విఖ్యాత ఆర్ట్స్, కల్చరల్ అకాడమీ శ్రీ గౌతమేశ్వర గోసంరక్షణ సేవా సమితి మంత్రపురి వారి సంయుక్త ఆధ్వర్యంలో నంది అవార్డు అందుకున్నారు. ఈనెల 28న హైదరాబాద్ వేదికగా ప్రపంచ ప్రఖ్యాత గాంచిన కళాక్షేత్రం శ్రీ త్యాగరాజ గాన సభలో కళారంగం, సాహితీ, విద్య, ఇతర రంగాల్లో విశిష్ట సేవలను అందిస్తున్న మహాను భావులను గుర్తించి అవార్డులను అందజేశారు. జాతీయ స్థాయిలో విశ్వ విఖ్యాత బంగారు నంది, మయూర , ఐకాన్ కీర్తి పురస్కారాలు 2024 సంవత్సరానికి గాను ఎంపికైన అవార్డు గ్రహీతలకు బంగారు నంది అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పుల్లూరి నాగేశ్వర్ ను కళా, సాహితీ రంగంలో చేస్తున్న విశిష్ట సేవలను గుర్తించి విశ్వ విఖ్యాత గౌతమి బంగారు నంది, పురస్కార రాజపత్రం శాలువాతో ఘనంగా సత్కరించి, పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో యస్ వి ఆర్ డిజిటల్ ఫోటోగ్రపీ అధినేత వేల్పుల వెంకటేష్ , శ్రీ గౌతమేశ్వర గోసంరక్షణ నిర్వాహక అధ్యక్షులు ఆకుల విద్యాసాగర్ గురూజీ, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త దైవజ్ఞ శర్మ, కవి, రచయిత, మాడుగుల భాస్కర శర్మ , కవి, విమర్శకులు, వైరాగ్యం ప్రభాకర్ , గోల్డ్ మెన్ సోదరులు ప్రముఖ వ్యాపార వేత్త కొత్త శ్రీనివాస్, ప్రముఖ పర్యావరణ వేత్తలు పిట్టల దొరబాబు, బుల్లితెర నటి హంస, మన మంథని యూట్యూబ్ చానల్ నిర్వాహకులు అవధానుల ప్రసాద్ తదితర ప్రము ఖుల చేతుల మీదుగా ఈ విశిష్టమైన శ్రీ గౌతమేశ్వర జాతీయ నంది పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందని కవి పుల్లూరి నాగేశ్వర్ తెలియజేస్తూ, సంతోషం వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా నిర్వాహక కమిటీ సభ్యులందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now