ప్రపంచ ఆదివాసీల దినోత్సవాన్ని విజయవంతం చేయండి

ప్రపంచ ఆదివాసీల దినోత్సవాన్ని విజయవంతం చేయండి

 – ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ.

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బుధవారం తుడుం దెబ్బ రాష్ట్ర సహాయ కార్యదర్శి మడకం చిట్టిబాబు అధ్యక్షతన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కబ్బాక శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీల దినోత్సవం వెంకటాపురం మండల కేంద్రంలో, ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఘణంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఆది వాసి మేధావులు, ఆదివాసి ప్రజాప్రతినిధులు, ఆదివాసి ఉద్యో గులు,ఆదివాసి నాయకులు, ఆదివాసి ప్రజలు, హాజరై విజ యవంతం చేయగలరని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి పాయం జానకి రమణ, జిల్లా ఉపాధ్యక్షులు, కాపుల సమ్మయ్య, జిల్లా కార్యదర్శి, సిద్ధబోయిన సర్వేశ్వర రావు, కుచ్చింటి చిరంజీవి, డివిజన్ నాయకులు పాయం కిరణ్, బొగ్గుల విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment