పిల్లి పిల్లలను మింగిన నాగుపాము
– తల్లి పిల్లి కొట్లాడి ఓడిపోయింది.
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం శ్రీరామ్ నగర్ గ్రామంలో కోడె హనుమంతరావు అనే రైతు నివాసం ఉంటున్న ఇంట్లో మంగళవారం రాత్రి నాగుపాము హల్చల్ చేసింది. మంగళ వారం ఇంట్లో జొరబడిన నాగుపాము రాత్రి అంత హనుంత రావు ఇంట్లో మూలన ఉండిపోయింది. అదే ఇంట్లో పెంపుడు పిల్లి రెండు మూడు రోజుల క్రితం పిల్లి పిల్లలను తీసుకు వచ్చింది. కన్న పిల్లలను పాలిచ్చి సేదతీరిస్తున్న ఆ తల్లి పిల్లి కి నాగుపాము పిల్లలకు పైకి బుస కొడుతూ వచ్చి ఒక పిల్లి పిల్లను మింగిన తర్వాత మరోక పిల్లి పిల్లని పిల్లలను మింగివేసింది. కళ్ళముందే తన పిల్లలను మింగుతున్న తల్లి పిల్లి పోరాడీ ఓడిపోయింది. మింగిన నాగుపాము మూలన పడుకొని ఉండగా, గృహస్తులు బుదవారం చూసి సమాచా రాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలియపరిచారు. పిల్లి పిల్లలను మింగి కదలలేని స్థితిలో వున్న నాగుపాము ఆ రాత్రంతా ఆ ఇంట్లో నే వుంది. హనుమంతరావు ఆ పాము ను చూసి ఫారెస్ట్ బీట్ ఆఫిసర్ చరణ్ కి ఫోన్ చేయడంతో, స్నేక్ రిస్క్ టీమ్ భార్గవ్ కు సమాచారం ఇచ్చారు. వెంకటాపురం నుండి స్నేక్ క్యాషర్ భార్గవ్ వచ్చి నాగుపాము ను చాకచక్యంగా పట్టుకొని ఫారెస్ట్ అధికారులు ఆధ్వర్యంలో, జనసంచారం లేని అటవీ ప్రాంతంలో వదిలి వేశారు. రాత్రంతా ఇంట్లో ఉన్న నాగుపాము నుండి కుటుంబానికి ఎటువంటి హాని జరగకుం డా ప్రాణాపాయ స్థితి నుండి కాపాడినందున ఫారెస్ట్ డిపార్ట్మెం ట్ కి, కోడె హనుమంతరవు, చింత కామేశ్వరరావు కృతజ్ఞత లు తెలియజేసారు. అలాగే చాకచక్యంగా నాగుపామును బంధించి అడవుల్లో వదిలివేసిన భార్గవ్ చౌదరికి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు.