వెంకటాపురం చౌదరిస్ వీధిలో మహా అన్నదానం

వెంకటాపురం చౌదరిస్ వీధిలో మహా అన్నదానం

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : గణపతి నవ రాత్రుల మహోత్సవాల సందర్భంగా శుక్రవారం పట్టణ కేంద్రం లోని చౌదరిస్ వీధిలో శుక్రవారం శ్రీ వినాయక స్వామి మండ పం వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘణంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని నవరాత్రుల ఉత్సవ కమిటీ పంపిణీ చేసింది. శుక్రవారం అనేక మండపాల వద్ద అన్నదాన కార్య క్రమాలు నిర్వహించి, స్వామివారి నిమజ్జన కార్యకమాలకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే గురువారం రాత్రి పొద్దుపో యే వరకు బలకట్టు వాగులో నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు.