మరికాలలో పిచ్చికుక్క స్వైర విహారం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం మరికాల గ్రామంలో సోమ వారం పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. గ్రామంలోని గడ్డం దినేష్ అనే బాలున్ని కరిచివేసింది. పిచ్చికుక్క గ్రామాల్లో ఉన్న కుక్కలను తరిమి తరిమి కరిచినట్లు సమాచారం. మండలంలోని నూగూరు గ్రామంలో పిచ్చికుక్క ఆదివారం ఏడుగురుని గాయపరిచి, మేకలు, పశువుల ను సైతం కరిసిన సంఘటన మరువక ముందే మరికాల గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసి గాయ పరచడంతో మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో వందలు, వేల సంఖ్యలో కుక్కల సంతానం పెరిగిపోవడంతో పాటు, పిచ్చి కుక్కలుగా మారి, ప్రజలపై దాడులు చేస్తుండడంతో, బయట కు రావడానికి ప్రజలు భయాంధోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికాల గ్రామస్తులు అందరూ ఏకమై పిచ్చికుక్కను చంపివేశారు.