చిరుత పులి చర్మం పట్టివేత – నిందితుని అరెస్టు

చిరుత పులి చర్మం పట్టివేత – నిందితుని అరెస్టు

– వివరాలు వెల్లడించిన ఏటూరునాగారం ఎఎస్పి శివం ఉపాధ్యాయ 

వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి : చిరుత పులి ని సంహరించి చర్మంతో వెళ్తున్న నిందితులను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎటునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు. ములుగు జిల్లా వాజేడు మండలం చండ్రుపట్ల ఎన్హెచ్ 163 క్రాస్ రోడ్డు వద్ద నమ్మదగిన సమాచారంతో పోలీస్ మరియు ఫారెస్ట్ శాఖ సంయుక్తంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై చిరుతపులి చర్మాన్ని తరలిస్తున్న వ్యక్తి పట్టుబడ్డాడు. ఏటురునాగారం ఎఎస్పి శివం ఉపాధ్యాయ కేసు వివరాలను మీడియాకు విడుదల చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి…. చతిస్గడ్ రాష్ట్రం బీజా పూర్ జిల్లా, భూపాలపట్నం ప్రాంతానికి చెందిన జాడి మహేందర్ ద్విచక్ర వాహనంపై చిరుతపులి చర్మాన్ని తెలంగాణలోని ప్రముఖ నగరంలో విక్రయించేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పేరూరు పోలీసులు, అటవీ శాఖ అధికారులు చండ్రుపట్ల క్రాస్ రోడ్ వద్ద పట్టుబడ్డాడు. ద్విచక్ర వాహనాన్ని, చిరుత పులి చర్మాన్ని, సెల్ఫోన్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుని అరెస్టు చేసి వన్యమ్రుగ సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేఅయినట్లు ఎఎస్పి తెలిపారు. ఈ కార్యక్రమంలో వాజేడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రమౌళి, వెంకటాపురం సిఐ బండారు కుమార్, పేరూరు ఎస్సై కృష్ణ ప్రసాద్, పోలీస్ మరియు అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.