వెంకటాపురం తహసిల్దార్ గా లక్ష్మీ రాజయ్య

వెంకటాపురం తహసిల్దార్ గా లక్ష్మీ రాజయ్య

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల తహసిల్దార్ గా పి. లక్ష్మీ రాజయ్య ను నియమిస్తూ ములుగు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న వీరభద్ర ప్రసాద్ ను ములుగు జిల్లా కలెక్టరేట్ కు బదిలీ చేశారు. కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్న పి. లక్ష్మి రాజయ్య వెంకటాపురం తహసిల్దార్ గా శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు,కార్యాలయం సిబ్బంది, ప్రముఖులు నూతన తాసిల్దార్ లక్ష్మీరాజయ్య కు పుష్ఫ గుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపి, అభినందనలు తెలిపారు.