బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు సన్మానం

Written by telangana jyothi

Published on:

బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు సన్మానం

తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : మండలంలోని ఏటూరు, కంతనపల్లి పాఠశాలల్లో విధులు నిర్వహించి ఇటీవల బదిలీ పై వెళ్లిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. బదిలీ అయిన ఉపాధ్యాయులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చింతగూడెం హెడ్మాష్టర్ కోరగట్ల రవీందర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ఏ పాఠశాలకు వెళ్లిన సమయపాలన పాటిస్తూ, అంకిత భావంతో విధులు నిర్వహించాలన్నారు. ఉత్తమ విద్య బోధన తోనే ఉపాధ్యా యులు ప్రత్యేక గుర్తింపు పొందు తారని, పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్ర మంలో ఉపాధ్యాయులు రాజు, చంద్రయ్య, రమేష్, పార్వతి, సింగారం, సారంగపాని తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now