ఘనంగా సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి 

ఘనంగా సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి 

ఘనంగా సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి 

– ప్రత్యేక పూజలు చేసిన బాల బ్రహ్మచారి కిషన్ మహరాజ్

ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ 286వ జయంతి వేడుకలు ములుగు మండలం దేవగిరిపట్నం ఆలయంలో ఘనంగా జరిగాయి. ఆలయంలో బాల బ్రహ్మచారి కిషన్ మహరాజ్ ఆధ్వర్యంలో భోగ్ భండారో నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్, బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు భూక్య జంపన్న ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై పూజలు చేశారు. బంజారాల సంస్కృతీ, సాంప్రదా యాలు ప్రత్యేకమైనవని, సంత్ సేవలాల్ తమ సంస్కృతిని విస్తరించేందుకు, ప్రజలను బయటి సమాజం నుంచి రక్షించేందుకు జీవిత పోరాటం సాగించారన్నారు. మత మార్పిడికి వ్యతిరేకం గా పోరాటం చేసి బంజారాలను సన్మార్గంవైపు మళ్లించి చరిత్రను, సంస్కృతిని పరిరక్షించు కోవాల్సిన అవసరం నేటి సమాజం అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ధారావత్ భద్రు నాయక్, కరణ్ సింగ్, బాదావత్ బాలాజీ, గోర్ సిక్వాడి ములుగు జిల్లా అధ్యక్షులు పోరిక రాజ్ కుమార్ నాయక్, పోరిక రాహుల్ నాయక్, వినోద్ నాయక్, సింగర్ ఎస్పీ నాయక్ బృందం, బంజారా కుల పెద్దలు, యువకులు, గ్రామపెద్దలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.