ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు
ములుగు ప్రతినిధి : యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ములుగు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోతు రవిచందర్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహంవద్ద జరిగిన కార్యక్రమంలో రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ధనసరి సూర్య హాజరై కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. 1960లో ఏర్పడిన యువజన కాంగ్రెస్ ఎంతోమంది యువతను రాజకీయాల్లో రాణించేలా తయారు చేసిందన్నా రు. విద్యార్థి, ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తూ ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు అశ్విన్ రాథోడ్, ఇస్సార్ ఖాన్, మారం సుమన్ రెడ్డి, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్, అధికార ప్రతినిధి వంశీ, కార్యదర్శి నేపాల్ రావు, తదితరులు పాల్గొన్నారు.