క్విట్ ఇండియా ఉద్యమస్పూర్తి తో పోరాటాలు ఉధృతం చేయాలి 

Written by telangana jyothi

Published on:

క్విట్ ఇండియా ఉద్యమస్పూర్తి తో పోరాటాలు ఉధృతం చేయాలి 

– ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్

గవాక్షం, ములుగు ప్రతినిధి : క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పోరాటాలు ఉధృతం చేయాలని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ పిలుపునిచ్చారు. శుక్రవా రం ములుగులోని అంబేద్కర్ సెంటర్ లో ఏఐటీయూసీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ కేంద్రం అనేక కార్మిక చట్టాలను రద్దుచేసిందన్నారు. కేంద్రం బడాబాబులకు మాత్రమే వత్తాసు పలుకుతోందని విమర్శించారు. కార్పోరేట్ కంపెనీలతో చిన్న, మధ్య తరహా వ్యాపారులు, చిరు వ్యాపారులు కుదేలవు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కోసం నల్ల చట్టాలను రద్దు చేసిన కేంద్రం మరిన్ని చట్టాలను తీసుకువచ్చేందుకు చూస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి, ప్రజాసంఘాల నాయకులు ఇంజం కొముర య్య, అంజద్ పాషా, ముత్యాల రాజు, జక్కుల రాజు, మిరియాల రవి, నాగరాజు, రాజయ్య, సంపత్, రఘు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment