దుప్పి వేటగాళ్లను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు
తాడ్వాయి, తెలంగాణ జ్యోతి : తాడ్వాయి మండలం లింగాల గ్రామంలో ఆరుగురు దుప్పి వేటగాళ్లను ఫారెస్ట్ అధికారులు పట్టు కున్నారు. ఫారెస్ట్ సెక్షన్ అధికారి సిహెచ్ ఆదినారాయణ మాట్లాడు తూ గత ఆదివారం రాత్రి వచ్చిన సమాచారం మేరకు సెక్షన్, రేంజ్ అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. రాత్రి 10 గం లకు లింగాల చెన్నూరి సతీష్ చాపల అశోక్ ఇంట్లో దుప్పి మాసం లభించిందని తెలిపారు. అలాగే దుప్పిని వేటాడానికి ఉపయోంచిన ఉచ్చు, బైండింగ్ వైర్లను, దుప్పి తోలును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. దీనిలో పాల్గొన్న నిందితులు చాపల అశోక్, చెన్నూరి సతీష్ సతీష్,చాపల విజయ్ కుమార్, పెద్దకట్ల పోతరాజు, యు. ప్రకాష్(ఒకరు మైనర్) అని తెలిపారు. పూర్తి విచా రణ చేపట్టి నిందితులపై చట్ట పరంగా తదుపరి చర్యలు తీసుకుం టామని తెలిపారు.వన్య ప్రాణులను ఎలాంటి హానీ చేసిన, చంపినా చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్ర మంలో ఫారెస్ట్ రేంజ్ బీట్ అధికారులు పాల్గొన్నారు.
1 thought on “దుప్పి వేటగాళ్లను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు”