వరద బాధిత ప్రయాణికులకు భోజనం ఏర్పాట్లు
వరద బాధిత ప్రయాణికులకు భోజనం ఏర్పాట్లు
– సెల్ షాప్ యజమానికి పలువురి ప్రశంసలు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో టేకులగూడెం వద్ద అంతర్రాష్ట్ర జాతీయ రహదారి వరద నీటితో స్తంభించి పొయి రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. భారీ నీటి ప్రవాహంతో కనీసం నడవడానికి వీలు కాకపోవడంతో జాతీయ రహదారిపై ప్రభుత్వ అధికారులు రాకపోకలు నిలిపివేస్తూ భారీకేట్లు ఏర్పాటు చేశారు. రహదారికి ఇరువైపులా వందలాది వాహనాలు ప్రయాణికులతో నిలిచిపోయాయి. వారికి మంచి నీళ్లు, ఆహారం లేక పిల్లలు, వృద్దులు,మహిళలు షేషెంట్లు, ఇబ్బందులు పడుతుండగా వారి బాధలను చూసి చలించి పోయిన ఏ టు జెడ్ మొబైల్ షాప్ యజమాని ఫిరోజ్ ఖాన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రయాణికులకు భోజనం ఇతర సదుపాయాలను కల్పించారు. ఏ టు జెడ్ మొబైల్ షాప్ యజమాని ఫిరోజ్ సేవా దృక్పధానికి ప్రయాణికులు అభినందనలు తెలియజేశారు.