వరంగల్ పోచమ్మ మైదాన్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం
వరంగల్, తెలంగాణ జ్యోతి : వరంగల్ జిల్లా కేంద్రంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్లోని వద్దిరాజు షాపింగ్ కాంప్లెక్స్ గురువారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మాల్ లోపల ఉన్న ప్రజలు, విక్రయదారులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. 102 ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు… కాగా ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.