ఆర్ బి ఎస్ కే ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు 

ఆర్ బి ఎస్ కే ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు 

ములుగు ప్రతినిధి : ములుగు ఆర్ బి ఎస్ కే వైద్య బృందం చే జవహర్ నగర్ విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిం చారు. బుధవారం జవహర్ నగర్ కేజీబీవీ పాఠశాలలో విద్యా ర్థినీలకు అందత్వ నివారణ సంస్థ ఎన్ పీ సీ బీ, ములుగు ఆర్ బి ఎస్ కే వైద్య బృందం ఆధ్వర్యలో ఆప్తాల్మిక్ ఆఫీసర్ పర్య వేక్షణలో దృష్టిలోపం గల పిల్లలకు అందత్వ నివారణ పరీక్ష లు నిర్వహించి అవసరం ఆయన విద్యార్థులకు మందులు అందజేశారు. విద్యార్థి దశలో అంధత్వం రాకుండా తీసుకో వాల్సిన ఆహారం పాటించవలసిన నియమాలు విద్యార్థులకు వైద్యులు సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్ బి ఎస్ కే వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ జయప్రద ఫార్మసిస్ట్ నవీన్ రమాదేవి నేత్ర వైద్య సహాయకుడు జే తిరుపతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment