తప్పిపోయిన వ్యక్తి శవమై తేలాడు
– ఏటూర్ లో మిస్సింగ్.. కంతనపల్లి లో మృతదేహం…
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : తప్పి పోయిన వ్యక్తి చెరువులో శవమై తేలడంతో కన్నాయిగూడెం మండలంలో కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు ఇచ్చిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గత రెండు నెలలుగా కాటాపురం గ్రామా నికి చెందిన లంజపల్లి రవికుమార్ పనుల నిమిత్తం ఏటూర్ గ్రామానికి వెళ్లి తన మామా ఇంట్లో ఉండి కూలిపని చేసుకుం టున్నాడు. గత రెండు రోజులుగా కనిపించకపోవడంతో రవి కుమార్ మామ చిట్యాల లక్ష్మయ్య సోమవారం మిస్సింగ్ కేస్ పెట్టాడు. పోలీసులకు పిటిషన్ ఇవ్వడంతో వెంటనే కేస్ నమో దు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కన్నాయిగూడెం మండలం కంతనపల్లి సమీపంలో ఒక గుర్తు తెలియని మృతదేహం కనిపించగా పరిశీలించిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా పచ్చబొట్టు ఆధారంగా లంజపల్లి రవి కుమార్ గా నిర్ధారించారు. రవికుమార్ కు భార్య, నాలుగు ఏళ్ల పాప ఉంది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కన్నాయి గూడెం ఎస్సై వెంకటేష్ తెలిపారు.