వెంకటాపురంలో విస్తృత వాహన తనిఖీలు
భద్రతపై పోలీసుల అవగాహన
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 21, తెలంగాణ జ్యోతి: వెంకటాపురం లో విస్తృత వాహన తనిఖీలు నిర్వహిస్తూ రోడ్డు ప్రయాణ భద్రతపై పోలీసులు అవగాహన కల్పించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని శివాలయం సెంటర్లో మంగళవారం సాయంత్రం పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలకు సంబంధించిన పత్రాలు మరియు డ్రైవింగ్ లైసెన్సులు కలిగి ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని వాహనదారులకు వివరించారు. వెంకటాపురం పోలీస్ స్టేషన్ శిక్షణ ఎస్.ఐ తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సివిల్ పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీసులు చేపట్టిన ఈ చర్యలతో వాహనదారుల్లో భద్రతపై చైతన్యం పెరిగింది.









