డీటీఎఫ్ కాటారం మండల కార్యవర్గం ఎన్నిక

డీటీఎఫ్ కాటారం మండల కార్యవర్గం ఎన్నిక

డీటీఎఫ్ కాటారం మండల కార్యవర్గం ఎన్నిక

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) కాటారం మండల శాఖ నూతన కమిటీని మండల కేంద్రంలో గురువారం ఎన్నుకున్నారు. డీటీఎఫ్ మండలాధ్యక్షుడిగా రాజేశం, ప్రధాన కార్యదర్శిగా రాజు నాయక్, ఉపాధ్యక్షులుగా గణపతి నాయక్, భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, కార్యదర్శులుగా మోహన్, సురేష్, నాగరాజు, నర్సయ్యలు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో డీటీఎఫ్ జిల్లా కార్యదర్శి భోజ్యా నాయక్, జిల్లా కౌన్సిలర్లు రమణారెడ్డి, ఇంద్రరేఖ, కరుణాకర్ రావు, లక్ష్మణ్ నాయక్ లు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పీఆర్సీని అమలు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న డీఏలు, మెడికల్ బిల్లులను వెంటనే విడుదల చేయాల న్నారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ ఆడిట్ కమిటీ కన్వీనర్ క్రుష్ణవేణి, సభ్యులు సడువలయ్య, పర్వీన్ లు పాల్గొన్నారు.