ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ప్రారంభించిన ఎన్నికల ప్రచారం
ములుగు ప్రతినిధి : జిల్లా కేంద్రంలో ములుగు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ములుగు గట్టమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ములుగు ప్రేమ్ నగర్ నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కెసిఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలకు ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు అధిక మెజార్టీతో గెలిపిస్తారని ధీమా ఇస్తున్నారు. బిఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలు నమ్మకంతో ఉన్నారని బడే నాగజ్యోతి తెలిపారు
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
2 thoughts on “ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ప్రారంభించిన ఎన్నికల ప్రచారం”