బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థికి సైకిల్ బహుకరణ
బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థికి సైకిల్ బహుకరణ
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : మండల కేంద్రం లోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో పేద విద్యార్ధి అయిన పూస పల్లవి కి బ్లడ్ డోనర్స్ సభ్యులు బెల్లం శ్రీనివాస్ సహకారంతో సైకిల్ ను అందించారు. ఈ కార్యక్రమం కు ముఖ్య అతిధిగా విచ్చేసిన సాయిబాబా దేవాలయం చైర్మన్ ప్రభాకర్ & బ్లడ్ డోనర్స్ సలహా దారులు ఖాజా పాషా విచ్చేసి విద్యార్థులకు పదవ తర గతి లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న ఇద్దరు విద్యార్థు లకు బహుమానం అందచేస్తాం అని అన్నారు. పేదవాడి జీవితాన్ని మార్చేది కేవలం చదువు మాత్రమే అని, దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమం లో బ్లడ్ డోనర్స్ మహమ్మద్ మున్నా, మల్యాల పవన్ చామర్తి కిషోర్, రాజేందర్, రోకేష్, రెడ్డి రామ్, కీలకత్తుల ప్రశాంత్ కేజీబీవీ ప్రత్యేక అధికారి మడే అరుణ, ఉపాధ్యా య సిబ్బంది శ్రీదేవి, రమాదేవి, స్వరూప, విజయ, వర లక్ష్మి, కౌసల్య, రమ్యకృష్ణ, రేఖరాణి, నాగలక్ష్మి విద్యార్థు లు పాల్గొన్నారు.