విద్యార్థులకు పెన్నులు, గ్లాసులు, ప్లేట్లు పంపిణీ
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం సుడిబాక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పీర్ల కృష్ణబాబు కుమారుడు జతిన్ శ్రీ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు, పెన్నులు, పెన్సిల్స్, ఎరేజర్స్ ను మంగళవారం పంపిణీ చేశారు. నాయకులగూడెం ప్రాథమిక పాఠశాలలో చదువు కుంటున్న 50 మంది విద్యార్థులకు, ఎంపీపీఎస్ సుడిబాక పాఠశాలలో చదువుకుంటున్న 26 మంది విద్యార్థులకు భోజనం ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెండు పాఠశా లల ఉపాధ్యాయుల బృందం చిన్నారి చిరంజీవి పీర్ల జతిన్ శ్రీకృష్ణకు పుట్టిన రోజు శుభాకాం క్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులగూడెం పాఠశాల హెచ్.ఎం. పి. సూర్యనా రాయణ, ఉపాధ్యాయులు, ఇర్ఫా ప్రభాకర్, సుడిబాక హెచ్.ఎం. పీర్ల క్రిష్ణ బాబు, మహిళా టీచర్లు పి. సంధ్యారాణి, పి.సరూప రాణి, అంగన్వాడీ టీచర్ సుమతి తదితరులు పాల్గొన్నారు.