గ్రామసభలో అధికారులను నిలదీసిన బిఆర్ఎస్ అధ్యక్షుడు పెనుమల్ల రామకృష్ణారెడ్డి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం-కొంగాల (జి.పి) జగన్నాధపురంలో మంగళవారం నిర్వహించిన గ్రామసభలో ఆరు గ్యారెంటీలపై వాజేడు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెనుమాళ్ళ రామకృష్ణారెడ్డి, గ్రామసభకు హాజరైన ప్రజలు అధికారులను గట్టిగా నిలదీశారు. రెండు లక్షల రుణ మాఫీ,తులం బంగారం, రైతు భరోసాకు ఇంత వరకు అతీ గతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీల్లో కాంగ్రెస్ పార్టీ మోసాలను, ఎండగడుతూ ప్రజల పక్షాణ బిఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని పార్టీ నేత పెనుమల్ల రామ కృష్ణారెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందంటు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు కొత్త గట్టు సాంబమూర్తి, జగన్నాధపురం గ్రామ నాయకులు, మహిళా నాయకురాళ్ళు, మండల నాయకులు, తదితరు లు పాల్గొన్నారు.