వెంకటాపురంలో ముగిసిన క్రికెట్ పోటీలు

Written by telangana jyothi

Published on:

వెంకటాపురంలో ముగిసిన క్రికెట్ పోటీలు

– విజయం సాధించిన కొంగాల జట్టు

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రం కాఫేడ్ ఆవరణలో సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా వెంకటాపురం క్రికెట్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో వాజేడు, వెంకటాపురం మండలాల పరిధిలో క్రికెట్ పోటీలను ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు. ఈ పోటీలు ఈనెల 13వ తేదీన లాంచనంగా ప్రారంభిం చారు. 7 రోజులు పాటు జరిగిన క్రికెట్ పోటీలలో మొత్తం 28 జట్లు పాల్గొన్నాయి. గ్రామీణ యువత, తమ క్రీడా నైపుణ్యాన్ని ఇటు వంటి పోటీలలో పాల్గొని, వెలుగులోకి వచ్చి, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించే విధంగా క్రీడలు ఎంతో దోహదం చేస్తా యని క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కుమార్ అన్నారు. వెంకటాపురం, వాజేడు మండలాలకు సంబంధించిన క్రికెట్ జట్లు, వారి స్నేహితులు క్రికెట్ తిలకించేందుకు వచ్చిన యువతతో వెంకటాపురంలో ఏడు రోజులు పాటు యువత కేరింతలతో సందడి నెలకొన్నది. గ్రామీణ యువత క్రీడలను ప్రోత్సహించేందుకు జన్మతః వెంకటా పురం వాస్తవ్యులు, కొత్తగూడెం పట్టణ ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కే. నరేష్ క్రికెట్ పట్ల ఆసక్తితో యువతకు ప్రోత్సాహం ఇచ్చి, వారం రోజులు పాటు క్రికెట్ పోటీలు ఆనందోత్సల మధ్య నిర్వహించేందుకు ప్రోత్సహించారు. వెంకటాపురం వాస్తవ్యులు ట్రాఫిక్ ఎస్.ఐ.నరేష్ ఉత్సాహానికి వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు,యువత ,మీడియా సైతం సహాయ సహకారాలు అందించారు.క్రికెట్ పోటీ లను వెంకటాపురం సి.ఐ. బి. కుమార్ లాంఛనంగా ప్రారంభించి, బ్యాటింగ్తో, సంక్రాంతి పండుగ క్రికెట్ పోటీలకు శ్రీకారం చుట్టారు. కాగా ఏడు రోజులు పాటు జరిగిన క్రికెట్ పోటీలు ఆదివారం 19వ తేదీతో ముగిసాయి. వెంకటాపురం వర్సెస్ వాజేడు మండలం కొంగాల జట్లు హోరాహోరీగా తలపడగా కొంగాల జట్టు విజయం సాధించింది. మొదటి బహుమతిగా 20,000 వేల రూపాయలు నగదు, షీల్డ్ ను కొంగాల జట్టుకు అందజేశారు. అలాగే రెండవ బహుమతిగా వెంకటాపురం జట్టుకు, పదివేల రూపాయలు షీల్డ్ లను అందజేశారు. మూడో బహుమతిగా రామచంద్రపురం జట్టుకు 5వేల రూ. నగదు, షీల్డ్ లను క్రీడాకా రుల ఆనందోత్సవాల మధ్య అందజేశారు. క్రీడలలో గెలుపు, ఓటములు సహజమని, గ్రామీణ యువత, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో ముందుకు సాగాలనీ ఈ సందర్భంగా పలువురు అభిలాషించారు. ఆదివారం జరిగిన బహుమతుల ప్రధానోత్స వంలో వెంకటాపురం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కే. తిరుపతిరావు, శిక్షణ ఎస్.ఐ. సాయి కృష్ణ, మరియు వెంకటాపురం క్రికెట్ టోర్నమెంట్ టీం, క్రికెట్ అభిమానులు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 7 రోజులపాటు జరిగిన క్రికెట్ పోటీలకు తరలి వచ్చిన టీములకు వారి అభిమానులకు, వెంకటాపురం క్రికెట్ టీం యువత వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, సౌకర్యాలు కల్పించి శాంతియుత వాతావరణంలో క్రికెట్ పోటీలు విజయవంతంగా నిర్వహించినందుకు పోలీస్ అధికారులు, గ్రామస్తులు వెంకటా పురం క్రికెట్ యువతను అభినందించారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now