మావోల లేఖ నిజమేనా..?

 Bade  Damodar | నేలకొరిగిన ఎర్రమందారం 

మావోల లేఖ నిజమేనా..?

– దామోదర్ మృతి చెందాడా..?

– లేఖ తప్ప ఆధారాలేవి..!

– బడే చొక్కారావు మృతిపట్ల వీడని సందిగ్ధం

   ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : దామోదర్ చనిపాయాడా..? చనిపోతే మృత దేహం ఏదీ..? మావోయిస్టుల పేరిట లేఖ విడుదల చేసిందెవరు..? ఆ లేఖ నిజమేనా? లేక కల్పితమా.. ఒక వేళ నిజమే అయితే ఆధారాలేవి..? ఇలా తెలంగాణ, ఛత్తీస్ఘడ్ ఏజెన్సీ ప్రాంత ప్రజలను ప్రశ్నలు చుట్టుము డుతున్నాయి. సీపీఐ మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు బడే చొక్కారావు అలియాస్ దామోదర్, అలియాస్ మల్లన్న మృతిపై ఎన్నో సందేహాలు వెలువడుతున్నాయి. శనివారం బడే చొక్కా రావు చనిపోయాడని గంగ పేరిట మావోయిస్టులు లేఖ విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో వచ్చిన లేఖ తప్ప మరే ఆధారాలు కనిపించకపోవడంతో గందరగోళం నెలకొంది. శనివారం లేఖ ఆధారంగా చనిపోయారని అనుకున్న జనం సరైన ఆధారాలు కనిపించకపోవడంతో అసలు ఏం జరుగుతుందో తెలియని సందిగ్ధంలో ఉన్నారు. కుటుంబ సభ్యులు, ఇటు పోలీసులు, అటు మావోయిస్టులు ఎవరు కూడా అధికారి కంగా బడే చొక్కారావు చనిపోయాడని ధృవీకరించడంలేదు. కాల్వపల్లిలో బడే చొక్కారావు చనిపోయా డన్న వార్తతో కొంత విషాఛాయలు అలుముకున్నా స్పష్టత రావడంలేదు.

– కాంకేర్ జిల్లాలో ఎన్కౌంటరర్ మృతదేహాల్లో దామోదర్ ఏడీ..?

  చత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ ఎన్ కౌంటర్లో మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందినట్లు సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగ పేరుతో లేఖ విడుదల అయ్యింది. 18మావోయిస్టుల్లో దామోదర్ కూడా ఉన్నాడని, మావోయిస్టు పార్టీకి తీరని లోటని అందులో పేర్కొన్నారు. అయితే ఈ లేఖను ఆమె విడుదల చేసింది ఎవరు..? మావోయిస్టు పార్టీలో గందరగోళం సృష్టించడానికే ఈ లేఖను సృష్టించారా? అనే చర్చ తీవ్రంగా జరుగుతోంది. గురువారం రాత్రి జరిగిన ఎన్ కౌంటర్లో 18 మంది మృతి చెందగా, అందులో 12 మృతదేహాలు మాత్రమే పోలీసులకు లభ్యమ య్యాయి. అయితే ఎన్ కౌంటర్ జరిగినప్పుడు దామోదర్ ఆ ప్రాంతంలో లేడన్న ప్రచారం సైతం జోరుగా సాగుతోంది. ఎన్కౌం టర్కు సంబంధించిన మావోయిస్టు మృతుల ఫొటోలు, వీడియో లు మావోయిస్టులు, ఇటు పోలీసులు సైతం విడుదల చేసే వారు. కానీ మూడురోజులు పూర్తయినా కూడా ఇంతవరకు దామోదర్ ఫొటోను మవోయిస్టులు రిలీజ్ చేయలేదు. ఇటు పోలీసులు కూడా అధికారికంగా ధృవీకరించడంలేదు. దీంతో బడే చొక్కారావు ప్రాణాల తోనే ఉన్నాడని భావిస్తు న్నారు. ములుగు ఏజెన్సీ మండలాల్లో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృత్యు వార్త పైనే చర్చలు కొనసాగుతున్నాయి.

Bade  Damodar | నేలకొరిగిన ఎర్రమందారం 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment