కలెక్టర్లు ఎన్యూమరేటర్లలతో నిరంతర పర్యవేక్షణ చేయాలి

Written by telangana jyothi

Published on:

కలెక్టర్లు ఎన్యూమరేటర్లలతో నిరంతర పర్యవేక్షణ చేయాలి

– కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులను, ఎమ్మెల్యేలను ఆహ్వానించాలి.

– సర్వే ప్రక్రియను యావత్తు దేశం తెలంగాణను గమనిస్తున్నది. 

– సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే ప్రక్రియపై క్యాంపు కార్యాలయం నుండి సీఎస్ శాంతి కుమారి,  

– ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయాలతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి. 

– మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారని జిల్లా కలెక్టర్లును, ఎన్యూమరేటర్లు ను అభినందించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.

– కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

ములుగు ప్రతినిధి : హౌస్ లిస్టింగ్ పూర్తిచేసుకుని నేటి నుం చి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో కలెక్టర్ల పర్యవేక్షణలో ఎన్యూమరేటర్లు పకడ్బందీగా నమోదులు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపా రు.శనివారం నుండి ప్రారంభమైన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సమగ్ర సర్వే ఇంటింటి కుటుంబ సర్వేపై సీఎస్ శాంతికుమారి, ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాలతో కలిసి జిల్లా కలెక్టర్లుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ శనివారం నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజలకు అనేక సందేహాలు వస్తుంటాయని నివృత్తి చేస్తూ ముందుకు సాగాలని సూచిం చారు. ఎలాంటి సందేహాలున్న ఎన్యూమరేటర్లు కలెక్టర్లు దృష్టి కి తేవాలని పేర్కొన్నారు. సర్వేపై ప్రజలతో మమేకం అయితే సందేహాలు ఏమిటో తెలుస్తామని తక్షణమే నివృత్తి చేయడా నికి చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహ లు పడకుండా ఎన్యూమరేటర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సర్వే ప్రక్రియలో ప్రజల పట్ల ఎన్యూమరేటర్లు భాద్యతగా వ్యవహరించాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సర్వేలో భాగస్వాములు అయ్యేల ఆహ్వానిం చాలని తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే చాలా మంచి కార్యక్రమమని ప్రజల సమగ్ర సమాచారం సేకరణ వల్ల అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయడానికి దోహదపడతాయని తెలిపారు. హౌస్ లిస్టింగ్ సర్వే దిగ్విజ యంగా నిర్వహించారని, అదే ఉత్సాహంతో సర్వే ఆసాంతం పూర్తి అయ్యే వరకు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. సర్వే ప్రక్రియలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఎన్యూమరేటర్లకు సర్వే పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, హౌస్ లిస్ట్ పూర్తి చేశారని ఎలాంటి ఇబ్బంది లేకుండా ముం దుకు తీసుకెళుతున్నారని కలెక్టర్లను, భాగస్వామ్యం అయిన ఎన్యూమరేటర్లు ను, ప్రణాళికా శాఖ అధికారులను డిప్యూటీ సీఎం అభినందించారు.  ఇదే రీతిలో కుటుంబ సర్వేను విజ యవంతంగా నిర్వహించాలని మంత్రి కోరారు. మనదేశంలో జరిగే అతిపెద్ద కార్యక్రమమని, సిబ్బంది నిబద్ధత, అంకిత భావంతో సర్వే విజయవంతం చేయాలని అన్నారు. యావ త్తు దేశం మన రాష్ట్రం చేపడుతున్న సర్వేను గమనిస్తుందని నిబద్ధతతో పూర్తి చేసి ఆదర్శంగా నిలవాలని వివరించారు. ఈ దేశంలో ప్రగతిశీల భావాలను, కార్యక్రమాలను వ్యాప్తి చేయడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్న అధికారుల దృష్టికి తీసుకురావాలని, వచ్చిన సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. సర్వే సమాచా రం గ్రామస్థాయిలోని చిట్ట చివరి ఇంటికి చేరే విధంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, గ్రామాలు, పట్టణాల ప్రధాన కూడళ్ళలో హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని సూచించా రు. కలెక్టర్లతో పాటు అన్ని స్థాయిలలోని అధికారులు సర్వే ప్రక్రియ ను పరిశీలిస్తూ సిబ్బందికి తగు, సలహాలు సూచనలు ఇవ్వాలని, ప్రధానంగా పట్టణాలపై దృష్టి పెట్టాలని కోరారు.కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఇతరతర ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.అనంతరం కలెక్ట ర్ అధికారులతో మాట్లాడుతూ సర్వే కొరకు జారీ చేసిన బుక్ లెట్ లో మొత్తం 56 అంశాలున్నాయని ఎలాంటి అనుమా నాలు, సందేహాలకు తావు లేకుండా ప్రజల నుండి ఖచ్చిత మైన సమాచారం సేకరణతో నమోదులు చేయాలని సూచిం చారు. సర్వే ప్రక్రియను సూపర్ వైజర్లు, మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వే ప్రక్రియను నిబద్ధతతో నిష్పక్ష పాతంగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహిం చాలని అన్నారు. ప్రజలు సర్వే సిబ్బందికి సహకరించి సమగ్ర సమాచారం ఇవ్వాలని సూచించారు. సర్వే కు ఒక రోజు ముందు గ్రామాలు, పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహిం చాలని తెలిపారు. ప్రజల నుండి సేకరించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచడం జరుగుతుందని, ఎలాంటి అపో హలు లేకుండా ప్రజలు ఖచ్చిత సమాచారం ఇవ్వాలని సూచించారు. సర్వేపై ప్రజలు ఎలాంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని పేర్కొన్నారు. ఏలాంటి సందేహాలు ఉన్న ఎంపిడిఓ, తహశీల్దార్ల దృష్టికి తేవాలని తెలిపారు. సర్వే కు నియ మించిన ఎన్యూమరేటర్లు ఉపాధ్యాయులు, అంగన్ వాడి, కార్యదర్శులు, డిఆర్డీఓ సిబ్బంది మాత్రమే ఇంటింటికి వస్తారని, ఇతరులు వస్తే సమాచారం ఇవ్వొద్దని ప్రజలకు సూచించారు. సర్వేపై ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జి, సంపత్ రావు, ఆర్డీఓ ఎన్. వెంకటేష్ సంబం ధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now