గౌడ సంఘం అధ్యక్షులుగా చీటూరి రాజలింగం 

గౌడ సంఘం అధ్యక్షులుగా చీటూరి రాజలింగం 

గౌడ సంఘం అధ్యక్షులుగా చీటూరి రాజలింగం 

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గౌడ సంఘం అధ్యక్షులుగా చీటూరి రాజలింగం గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం కల్లు మండపం వద్ద జరిగిన గౌడ సంఘం సర్వసభ్య సమావేశంలో ఎన్నికలు జరిగాయి. ఉపాధ్యక్షులుగా మార్క రవీందర్ గౌడ్ ఎన్నికయ్యారు. కాగా ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు మారగోని రాజబాబు గౌడ్, చీకట్ల స్వామి గౌడ్, మారగోని తిరుపతి గౌడ్, మారగోని గణపతి గౌడ్, చీకట్ల రాజు గౌడ్, భీముని సత్యoగౌడ్, మార్గోని కార్తీక్ గౌడ్, బుడిగ వెంకన్న గౌడ్, మాదాస్ అంజయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.