భవన నిర్మాణ కార్మికులకు అడ్డాలు ఏర్పాటు చేయాలి

Written by telangana jyothi

Published on:

భవన నిర్మాణ కార్మికులకు అడ్డాలు ఏర్పాటు చేయాలి

       మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి : మహాదేవపూర్ మండలంలోని కాలేశ్వరంలో బిల్డింగ్ రంగంలో పనిచేస్తున్న భవన నిర్మాణ రంగ కార్మికులకు లేబర్ అడ్డాలు ఏర్పాటు చేసి షెడ్లను నిర్మించి ఇవ్వాలని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కుడుదుల వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో జరిగిన బిల్డింగ్ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ కార్మికుల ఆఫీసు కోసం రెండు గుంటల భూమిని ప్రభు త్వం కేటాయించాలన్నారు. గత పది సంవత్సరాలుగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తూ వారి వారి కుటుంబాలను పోషిం చుకుంటున్నారని, కాలేశ్వరంలో కార్మికుల సంఖ్య పెరుగు తున్న తరుణంలో  అడ్డాలు లేకుండా రోడ్లపైనే కార్మికులు విచ్చలవిడిగా ఉంటున్నారని ఆవేదన చెందారు. లేబరు అధికారులు, ప్రభుత్వ అధికారులు ఉన్న కార్మికులకు చేయా ల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమాత్రం అందకుండా పోయాయన్నారు. కార్మికులపై ప్రభుత్వ అధికారులకు, ప్రభు త్వానికి ఏమాత్రం పట్టింపు లేకుండా వారిని గాలికి వదిలే సారని వాపోయారు. అనంతరం నూతన కమిటీని బొల్లి శ్రీను, అశోక్, రాజబాబు, రాజన్న, దుర్గరా,జు శంకర్, సారయ్య,  శ్రీనివాస్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now