బిజేపి బూత్ కమిటీలను త్వరగా పూర్తి చేయాలి

బిజేపి బూత్ కమిటీలను త్వరగా పూర్తి చేయాలి

వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ప్రభుత్వ అతిది గృహం ఆవరణలో సోమవారం మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా వెంకటాపురం మండల సహయోగి నేత బిట్రగుంట క్రాంతి కుమార్ నాయుడు హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సభ్యత్వాలు, క్రీయా శీల సభ్యత్వాలు, పోలింగ్ బూత్, శక్తికేంద్రాలు తదితర పలు పార్టీ విషయాలపై కార్యకర్తలతో చర్చించి అవగాహన కల్పిం చారు. ప్రతీ కార్యకర్త క్రీయాశీలక సభ్యత్వం పొందాలని, బూత్ స్థాయిలో కమిటీలు ను త్వరగా పూర్తి చేసి మండల కమిటీకి అర్హత సాధించడానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాల న్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి అట్లూరి రఘు రామ్,మండల ప్రధాన కార్యదర్శి సాధనపల్లి విజయ్ కుమార్, జల్లి గంపల లక్ష్మీపతి నాయుడు,రామెళ్ల రాజశేఖర్, బొల్లె సునీల్,కోగిల శ్రీను, నోముల శ్రీ కిషన్, తోట సతీష్ కుమార్, గార ఆదినారాయణ, ఆత్మకూరి ప్రవీణ్ కుమార్, కందుల నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment