వెంకటాపురం మండలంలో భద్రాచలం ఎమ్మెల్యే విస్తృత పర్యటన

వెంకటాపురం మండలంలో భద్రాచలం ఎమ్మెల్యే విస్తృత పర్యటన
– గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే.
– ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ రూమ్,ల్యాబ్ ప్రారంభోత్సవం
– అడ్వాన్స్ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో భద్రాచలంఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు శనివారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా స్థానిక రోడ్లు భవనాలశాఖ అతిధి గృహంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే పుట్టినరోజు ఆదివారం కాగ ఒకరోజు ముందుగానే అడ్వాన్స్ పుట్టినరోజు వేడుకలను ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం చేతుల మీదుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం మాట్లాడుతూ అడ్వాన్సు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వెంకటాపురం మేజర్ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొని ప్రభుత్వం అమలు పరచిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తానన్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతం గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా అదనపు కోట మంజూరు చేస్తారని హామీ ఇచ్చినట్లు గ్రామసభలో తెలిపారు. ఇందిరమ్మ రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు ఇంకా అనేక సంక్షేమ పథకాలు దశలవారికి అమలు చేయడం జరుగుతుందని, పేర్లు రానివారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని, ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఈ సందర్భంగా గ్రామ సభలో హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే పర్యటనలో ఉపాధ్యాయ నియోజకవర్గం శాసన మండలి సభ్యులు ఏ. నర్సిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సినాప్సీన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ, కంప్యూటర్లు, మరియు సైన్స్ ల్యాబ్, విద్యార్థులకు సైకిళ్లు, మంచినీటి వసతి తో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టింది. కంప్యూటర్ రూమ్, సైన్స్ లాబ్లను రిబ్బన్ కట్ చేసి ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం లాంచనంగా ప్రారంభించారు. స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసిన 30 సైకిళ్లకు పైగా విద్యార్థులకు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తుందని, అలాగే ఉన్నత విద్య జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలు తదితర అంశాలపై సభా ముఖం గా హామీ ఇచ్చారు. ఉన్నత పాఠశాలలో వివిధ సౌకర్యాలు కల్పించిన సినాప్సీన్ స్వచ్ఛంద సేవా సంస్థకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, పిఎసిఎస్ చైర్మన్ చిడెం మోహన్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం సాంబశివరావు, యువ జన కాంగ్రెస్ అధ్యక్షులు చిట్టం సాయి, ఎస్సీ సెల్ నాయకుడు సాధన పెళ్లి శ్రీను, నేత శ్రీరాములు రమేష్, మాజీ జడ్పిటిసి పాయం రమణ మాజీ ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం, ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జీవివి సత్యనారాయణ, జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్ర మంలో వెంకటాపురం తహసిల్దార్ లక్ష్మీ రాజయ్య, ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ పలువురు అధికారులు పాల్గొన్నారు. వెంకటాపురం సి.ఐ బి.కుమార్, ఎస్సై కే. తిరుపతిరావు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.