వైద్యసేవల పట్ల అప్రమత్తంగా ఉండాలి
– జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : ప్రజలకు ఆరోగ్యంపట్ల ప్రత్యేక అవగాహన కల్పించాలని, ఏదైనా అనారోగ్యం కలిగితే మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య ఆదేశించారు. ములు గు జిల్లా వెంకటాపూర్ మండలంలో పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రిషిత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళ కార్యక్రమానికి హాజరై రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అటెండెన్స్, ఓపి, స్టాక్ రిజిస్టర్, మెడిసిన్ స్టోర్ రూమ్ ను పరిశీలించారు. రోగులకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వా రు ధైర్యం కోల్పోకుండా ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చి వైద్యం చేయించుకునేలా భరోసా కల్పించాలని సూచించారు. తద నంతరం చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకొని తగిన మందులు ఇవ్వాలని వైద్య సిబ్బంది కి సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యురాలు డాక్టర్ చంద న, ఫార్మసిస్ట్ రాజమణి, స్టాఫ్ నర్స్ మున్నమ్మ పాల్గొన్నారు.