మత్స్యకారుల వలలో పడిన మొసలి పిల్లలు
– సురక్షితంగా గోదావరిలో వదిలివేసిన అటవీశాఖ.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఇటీవల కాలంలో కురుస్తు న్న వర్షాలకు అనేక వాగులు వంకలు స్వల్పంగా వరద నీరు తో ప్రవహిస్తున్నాయి. ఇందులో భాగంగా రాచపల్లి పంచాయ తీలోని కాలువలో నీరు ప్రవహిస్తుండగా తొలకరి చేపలు పట్టుకునేందుకు మత్స్యకారులు వలలు వేయగా మొసలి పిల్లలు వలలో పడ్డాయి. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆ ముసలి పిల్లలను స్వాధీనం చేసుకుని సురక్షితంగా గోదావరిలో వదిలి వేసినట్లు సమాచారం. తొలకరి వర్షాలకు, వాగులు కు వరద నీరు స్వల్పంగా ప్రవహిస్తుండంతో గోదావరి నది నుండి చేపలతో పాటు మత్స్య సంపద, వాగులు గుండా పైకి చొచ్చుకు వస్తున్నాయి. ఈ మేరకు మత్స్యకారులు వలలు వేయడంతో కొత్తనీటికి చేపలు పుష్కలంగా వలలో చిక్కుకుంటున్నాయి. అందులో భాగంగా ముసలి పిల్ల వలలో పడినట్లు అటవీ శాఖ అధికారులకు తెలియపరచడంతో, గోదావరి లోకి సురక్షితంగా మొసలి పిల్లను వదిలివేసినట్లు అటవీశాఖ ప్రకటించింది.