మొహర్రం పీర్ల పండుగకు ముమ్మర ఏర్పాట్లు

Written by telangana jyothi

Published on:

మొహర్రం పీర్ల పండుగకు ముమ్మర ఏర్పాట్లు

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురంలో మొహర్రం పండుగ సందర్భంగా పీరీల పండుగ ను నిర్వహించేందుకు కమిటీ విస్తృతంగా సన్నాహాలు ప్రారంభించింది. వెంకటాపురం మండల కేంద్రం శివారు బీ.సీ. మరి గూడెం లో పీరీలను భద్రపరచుకునేందుకు మందిరం నిర్మించుకున్నారు. అయితే గోడలు పూర్తి కాక పోవటంతో ప్రముఖ వ్యాపారి భక్తులు, కలకోట సంతోష్ కుమార్ గుప్తా మందిరం చుట్టూ గోడ నిర్మాణం కొరకు 350 సిమెంటు ఇటుకలను కమిటీకి అందజేశారు. అలాగే ప్రతి ఏడాది మొహరం, పీర్ల పండుగ సందర్భంగా వెండి పీరీలను మిగతా పీరీలతో అలంకరింప చేసి, భక్తిశ్రద్ధలతో పీర్ల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు . పూర్వకాలం నుండి వెంకటాపురం మండల కేంద్రం తో పాటు చుట్టు ప్రక్కల గ్రామాలకు చెందిన సుమారు 32 పీరీలను ప్రతి ఏడాది మొహరం సందర్భంగా పండుగ రోజులలో ఆయా పీర్ల యజమానులు నూతన వస్త్రాలు భక్తితో అందజేస్తారు. అయితే పూనకం వచ్చి న వారు పీరీలతో యజమానుల ఇళ్ళుకు వెళ్ళి ,గుగ్గిలం‌‌‌ ,సాంబ్రాణి ధూపంతో పూజలు అందు కొని కుటుంభాన్ని కి ఆ శిస్సులు ఇస్తారు. అయితే బీసీ మరి గూడెం గ్రామ యువత, పెద్దలు సహకారంతో  మొహరం పీర్ల పండుగను కుల, మతాలకు అతీతంగా ఘనంగా నిర్వహిం చుకునేందుకు, శ్రమదానంతో పీరీలను భద్రపరచుకునేందుకు నిర్మించిన మందిరానికి చుట్టూ గోడలు నిర్మించుకోవడంలో, పాటు ప్రతిష్టమైన మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మొహరం పండుగ దగ్గర పడుతుండటంతో పీర్ల పండుగను అంగ,రంగ వైభవంగా నిర్వహించేందుకు కమిటీ, యువత, పెద్దలు భక్తిశ్రద్ధలతో ముమ్మర సన్నాహాలు ప్రారంభించారు.

Leave a comment