వెంకటాపురంలో యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ
వెంకటాపురం,ఏప్రిల్27,తెలంగాణజ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద ఎస్సై కే. తిరుపతి రావు వాహనదారులు, ద్విచక్ర వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలు, హెల్మెట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడప కూడదనే అంశాలపై అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డ్రగ్స్, మద్యం అలవాట్లు జీవితాలను నాశనం చేస్తాయని, రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలు ఎదుర్కొనే కష్టాలను గుర్తుంచుకొని భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించగా, పోలీస్ సిబ్బంది, వాహనదారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఎస్సైలు తిరుపతి రెడ్డి, సా సాయి కృష్ణ, ఏఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.









