కర్రె గుట్టల్లో ఎస్పీ పర్యటన.. రహదారి పనులు వేగవంతం చేయాలి

On: April 26, 2026 5:22 PM

కర్రె గుట్టల్లో ఎస్పీ పర్యటన.. రహదారి పనులు వేగవంతం చేయాలి

కర్రె గుట్టల్లో ఎస్పీ పర్యటన.. రహదారి పనులు వేగవంతం చేయాలి

ములుగు, ఏప్రిల్ 26, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్, ఐపీఎస్ ఆదివారం పోలీస్ అధికారులతో కలిసి వెంకటాపురం మండలంలోని కర్రె గుట్టల పరిధిలో ఉన్న జల్ల, డోలీ గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా మురుమూరు నుండి పామునూరు, జల్ల, డోలీ మీదుగా తాడపాల వరకు నిర్మాణంలో ఉన్న రహదారి పనులను పరిశీలించారు. రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు ఆదేశించారు. రహదారి నిర్మాణ పనుల కోసం రాత్రింబవళ్లు బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందితో మాట్లాడిన ఎస్పీ, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ రవీందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శంకర్, వెంకటాపురం సీఐ రమేష్, సివిల్ సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!