ములుగు కలెక్టర్‌గా హేమంత్ సహదేవరావు బాధ్యతల స్వీకరణ
ములుగు, ఏప్రిల్ 26, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా నూతన కలెక్టర్ గా భోర్కడే హేమంత్ సహదేవరావు ఐఏఎస్ ఆదివారం జిల్లా కలెక్టరేట్‌లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుకు ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేసి, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ రాజ్ కుమార్ సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.









