ఇందిరమ్మ ఇళ్ల సర్వేకు జిల్లా ప్రజలందరూ సహకరించాలి
ఇందిరమ్మ ఇళ్ల సర్వేకు జిల్లా ప్రజలందరూ సహకరించాలి
– జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో జిల్లా ప్రజలందరూ పాల్గొని సరియైన సమాచారం అందించి సహకరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సోమవారంఒక ప్రకటనలో కోరారు.ప్రజా పాలన ఆరు గ్యారెం టీలలో భాగంగా 4వ గ్యారెంటీ అయిన ఇందిరమ్మ ఇల్లు పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారి వివరాలను సేకరణను మొబైల్ యాప్ లో నమోదుకు సర్వే చేయబడు తుందనీ, జియో టాకింగ్ ఫోటో తీసుకోబడుతుందనీ, గతం లో ఇండ్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇండ్ల వద్దకు వచ్చే సిబ్బందికి ఇంటి స్థల ధ్రువీకరణ పత్రాలను, లబ్ధిదారుల ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ వివరాలు, ఖచ్చితమైన సమాచారం అందించాల్సిందిగా కలెక్టర్ ఆ ప్రకటనలో కోరా రు. సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులను, ఎం పి డి ఓ లను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవాలని లేదా కలెక్టరేట్లోనీ కంట్రోల్ రూమ్ నెంబర్ 1800 425 7109 ను సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.