పేరూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏటూరునాగారం ఏఎస్పి

పేరూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏటూరునాగారం ఏఎస్పి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ ను శనివారం ఏటూరునాగారం ఏఎస్పి శివ ఉపాధ్యాయ ఐపీఎస్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ కు సంబంధించిన అన్ని రికార్డ్స్ ను వెంకటాపురం సీఐ బండారి కుమార్ అందించగా పరిశీలించారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో పాటిస్తున్న 5-S ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు ఇలాగే కొనసాగించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, సిఆర్పీఫ్ క్యాంపు లోని అన్ని గార్డులను తనిఖీ చేసి తగు జాగ్రత్తల సూచించారు. సిఆర్ఫీఫ్ డి. ఎస్. పి, సిబ్బంది తో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో కొత్తగా నిర్మిస్తున్న సెక్యూరిటీ పెన్సింగ్ గురించి తగు సూచనలు ఇచ్చారు. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ జి.కృష్ణప్రసాద్ స్టేషన్ పరిధిలోని పూర్తి సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారికి వివరించారు. గంజాయి, గుడుంబా, కోడిపందాలు, పేకాట, మరియు అటవీ జంతువుల వేట తదితరాల గురించి ఆరా తీశారు. విధ్యుత్ తీగలు అమర్చి అడవి జంతువులను వేటాడే వేటగాళ్ళను ఉపేక్షించరాదని వారి పైన కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు పడేలా చూడాలని ఏఎస్పీ ఆదేశించారు. అలాగే మావోయిస్టుల కదలికల పైన ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని ఎఎస్.పి శివం ఉపాథ్యాయ ఆదేశించారు.