పిఎసిఎస్ కు జాతీయస్థాయిలో అవార్డు గర్వించదగ్గ విషయo 

పిఎసిఎస్ కు జాతీయస్థాయిలో అవార్డు గర్వించదగ్గ విషయo 

– చైర్మన్, పాలక వర్గానికి పలువురి సన్మానం

– చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి

మహదేవపూర్,తెలంగాణజ్యోతి: మహదేవపూర్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కు జాతీయస్థాయిలో అవార్డు రావడం గర్వించదగ్గ విషయమని సంఘం చైర్మన్ చల్లా తిరుపతి రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పిఎసిఎస్ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు ద్వారాతాను క్రమశిక్షణ నైతిక విలువలతో కూడిన రాజకీయ అనుభ వాలను పునికి పుచ్చుకొని ఆయన సహకారంతోనే రాజకీ యంగా ఎదగడం జరిగిందన్నారు. భవిష్యత్తులో మంత్రి సహకారంతో సంఘం మరింత అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు.అనంతరం బ్యాంకింగ్ సేవా రంగంలో రైతులకు మెరుగైన సేవలు అందించినందుకు గాను పిఎసిఎస్ కు జాతీయ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి ఎక్స్లెన్స్ అవార్డు రావడం పట్ల సంఘ చైర్మన్ ను, పాలకవర్గ సభ్యులను మాజీ చైర్మన్ ఎలమండ్ర రామన్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కలికోట వరప్రసాద్ శాలువా కప్పి సన్మానించారు.1981-82 స్థాపించిన సంఘం అంచలం చెలుగా ఎదిగి జాతీయ స్థాయి లో అరుదైనా గుర్తింపు రావడం శుభపరిణామం అన్నారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్ర మంలో ఎంపీపీ రాణి బాయి, జెడ్పిటిసి గుడాల అరుణ, ఎంపీటీసీ సభ్యులుమంచినీళ్ల దుర్గయ్య,రేవెల్లి మమత, చల్ల రమాదేవి, ఆకుతోట సుధాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట రాజబాబు, సంఘ మాజీ చైర్మన్ ఎనమండ్ర వామన్ రావు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు కలికోట వరప్రసాద్,కోట సమ్మయ్య,కటకం అశోక్, పాలకవర్గ సభ్యులు చీర్ల తిరుపతి రెడ్డి, మేసినేని కృష్ణారావు, చీర్ల శ్రీనివాస్, పంతంగి సుమన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment