ఇంటింటి సర్వే ను పకడ్బందీగా నిర్వహించాలి

ఇంటింటి సర్వే ను పకడ్బందీగా నిర్వహించాలి

– వెంకటాపురం తాసిల్దార్ లక్ష్మీ రాజయ్య

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను సోమవారం మండల తహసిల్దార్ లక్ష్మీ రాజయ్య ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. సోమవారం మండలంలోని వివిధ గ్రామాల్లో సర్వే బృందాలు ఇంటింటికి వెళ్లి వివరాలను నమోదు చేసుకుంటుండగా తహసిల్దార్ లక్ష్మీరాజయ్య పరిశీలించి తప్పులు లేకుండా పకడ్బందీగా ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించాలని, సిబ్బందిని ఆదేశించారు.