గట్టమ్మ వద్ద దాడికి పాల్పడ్డ వారిపై నాయకపోడ్​ ల ఫిర్యాదు

Written by telangana jyothi

Published on:

గట్టమ్మ వద్ద దాడికి పాల్పడ్డ వారిపై నాయకపోడ్​ ల ఫిర్యాదు

– అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు

ములుగు, తెలంగాణ జ్యోతి : గట్టమ్మ ఆలయం వద్ద ఆదిపత్య పోరులో భాగంగా దాడులకు పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్​ తెలిపారు. సోమవారం ఉదయం జాకారం గ్రామానికి చెందిన వారు గట్టమ్మ ఆలయంపై తమకు కోర్టు ఆర్డర్​ ఉందంటూ వచ్చి నాయకపోడ్ పూజారులపై దాడులు చేసినట్లు ప్రధాన పూజారి కొత్త సదయ్య ఫిర్యాదు చేశారన్నారు. ఆమేరకు దాడికి పాల్పడ్డ ఈర్ల చేరాలు, మాజీ సర్పంచ్​ రమేష్​, రఘు, అయిలయ్య, మరికొంతమంది మహిళలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now